Back to FeedQuickToday Shorts

Andhra Pradesh
Aug 1, 2026Short Read
ఉత్తరాంధ్ర అభివృద్ధిపై విమర్శకులకు లోకేష్ గట్టి కౌంటర్!
క్విక్ టుడే న్యూస్, ఏపీ :- భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయ ప్రారంభోత్సవ వేదికగా రాష్ట్ర మంత్రి నారా లోకేష్ ప్రతిపక్షాలపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.
ఉత్తరాంధ్రను, ఇక్కడి ప్రజలను గతంలో కొందరు చిన్నచూపు చూశారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
స్వాతంత్ర్య సమరయోధుడు అల్లూరి సీతారామరాజు తిరిగిన ఈ పుణ్యభూమిలో కనీసం ఎర్రబస్సు కూడా రాని మారుమూల ప్రాంతాలకు విమానాశ్రయం అవసరమా అని హేళన చేశారని గుర్తుచేశారు.అయితే, ఆ విమర్శకుల చెంపచెల్లుమనేలా, ఎర్రబస్సు రాని చోటకే నేడు ఎయిర్ బస్ వచ్చిందని, ఏకంగా దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారే ఇక్కడికి విచ్చేశారని లోకేష్ ఉద్ఘాటించారు.
ఈ ఎయిర్ పోర్టు ఉత్తరాంధ్ర ముఖచిత్రాన్ని మార్చేస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.





